17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఘనంగా భట్టి జన్మదిన వేడుకలు...

15-06-2025 07:01 PM

పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు..

కొత్తగూడెం (విజయక్రాంతి): డిప్యూటీ సీఎం, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం కొత్తగూడెం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. టీపీసీసీ సభ్యులు బాల శౌరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టిపిసిసి జనరల్ సెక్రెటరీ మోత్కూరి ధర్మారావు, మాజీ కౌన్సిలర్లు రజాక్, కాసుల వెంకట్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో  కేక్ కట్ చేసి వృద్ధుల సమక్షంలో జన్మదిన వేడుకలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా సురేష్ నాయక్ ఆధ్వర్యంలో,ఉర్దూ ఘర్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు పార్టీ కార్యకర్తలు, యువకులు, స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల శౌరి మాట్లాడుతూ... రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ కన్వీనర్ జేబీ శౌరి, టిపిసిసి జనరల్ సెక్రెటరీ మోత్కూరి ధర్మారావు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు, టౌన్ కన్వీనర్ మొహ్మద్ గౌస్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం రాజశేఖర్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నర్సింహారావు, కొత్తగూడెం టౌన్ యూత్ ఉపాధ్యక్షుడు ఎండి ఉస్మాన్, రంజిత్ నాయుడు, షేక్ నయిమ్, ఎస్ కె కరీం, కొమురయ్య, దావూద్, మాజీ కౌన్సిలర్లు తంగేళ్ల లక్ష్మణ్, పల్లపు లక్ష్మణ్, ఎండి రజాక్, కాసుల వెంకట్, నిసార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏలూరి రాందాస్, ఆదరి కొమురయ్య, స్థానిక కాంగ్రెస్ నాయకులు, యువజన విభాగం సభ్యులు, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు.