2 June, 2026 | 2:59 PM

వచ్చే ఎన్నికల్లో మాకు ప్రత్యర్థులే లేరు: భట్టివిక్రమార్క

02-06-2026 01:56 PM

ఖమ్మం: తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarkaఖమ్మంలోని మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. సర్(Special Intensive Revision) పై మీడియా దృష్టి పెట్టాలి.. ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు మ్యాపింగ్ పై దృష్టి పెట్టాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు ప్రత్యర్థులే లేరని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక పార్టీ బీజేపీనేనని ఉపముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. పనిచేసే పార్టీలకు ప్రచారం అవసరం లేదన్నారు. అసెంబ్లీ, ఎంపీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించామని వెల్లడించారు. జిల్లా పరిషత్ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.