శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, మేరమయాడి దేవాలయానికి భూమి పూజ
20-08-2026 11:21 PM
భూపాలపల్లి,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బానోతు వీధి, హనుమాన్ నగర్ కు సంబంధించిన లంబాడ జాతికి చెందిన వారు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, గిరిజన ఆరాధ్య దైవమైన మేరమయాడి దేవాలయానికి గురువారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇరుతండాల పెద్దమనుషులు, మహిళలు రంగ రంగ వైభవంగా పూజా కార్యక్రమం నిర్వహించి ప్రసాదం సేవించి గిరిజన సంస్కృతి సాంప్రదాయా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో తండా పెద్దలు ఇస్లావత్ రవీందర్, పూజారులు బానోత్ రాజు నాయక్, ఇస్లావత్ రాజు నాయక్, ఇస్లావత్ దేవన్, అజ్మీర జంపన్న, గుజురోత్ రాజునాయక్, 21వ వార్డు కౌన్సిలర్ ధరావత్ శారద తదితరులు పాల్గొన్నారు.






