20 August, 2026 | 11:56 PM

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

20-08-2026 11:23 PM

నిర్మల్,(విజయక్రాంతి): కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఐటిఐ కళాశాలలో మాజీ ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.  రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దేశ ఐక్యత, సమగ్రత కోసం చేసిన సేవలను, యువత అభ్యున్నతికి తీసుకున్న నిర్ణయాలు దేశంలో కంప్యూటర్ సాంకేతిక విప్లవానికి వేసిన పునాదులను గుర్తు చేసుకున్నారు. సద్భావనా దివస్ సందర్భంగా శాంతి, సోదరభావం, మత సామరస్యం మరియు జాతీయ సమైక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమూర్తి, దేవరకోట ఆలయ మాజీ చైర్మన్ ఆమెడ శ్రీధర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.