20 August, 2026 | 11:53 PM

ధర్మరావుపేట ఊర చెరువులో పడి ఒకరి మృతి

20-08-2026 11:15 PM

గణపురం,(విజయక్రాంతి): మండలంలోని ధర్మారావుపేట గ్రామానికి చెందిన తోటరాజు (35) ప్రమాదవశాత్తు గ్రామ ఊర చెరువులో పడి గురువారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రాజు తమ్ముడు దేవేందర్ కు చెందిన గేదెలు చెరువులోకి వెళ్ళగా జెసిబి తో తీసిన గుంతలో మునిగిపోయాయి. దీంతో దేవేందర్ వెంటనే తన సోదరుడైన రాజుకు ఫోన్ చేసి చెప్పగా ఆయన వెంటనే ఉర చెరువు వద్దకు చేరుకొని లోపలికి వెళ్లి గేదెలను బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నంలో చెరువులో ఉన్న జెసిబి గుంతలో మునిగిపోయి మృతి చెందాడు. మృతుడు రాజుకు భార్య రమ్య కూతురు ఉన్నారు.