రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
రాజీవ్ గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవలో ముందుకు సాగాలి
కాంగ్రెస్ పార్టీ కొడిమ్యాల మండల అధ్యక్షుడు గోగూరి నాగ భూషణ్ రెడ్డి
కొడిమ్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో అంగడి బజార్ గాంధీ చౌక్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా గురువారం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ కొడిమ్యాల మండల అధ్యక్షుడు గోగూరి నాగభూషణ్ రెడ్డి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... రాజీవ్ గాంధీ భారతదేశాన్ని ఆధునిక,సాంకేతిక శక్తిగా తీర్చిదిద్దేందుకు ఎంతో దూరదృష్టితో పనిచేశారని, దేశంలో కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటి భారతదేశ ప్రగతికి బలమైన పునాదులు వేశాయని,యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ,దేశ భవిష్యత్తు కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని,ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజా సేవలో ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి,ఏఎంసి వైస్ చైర్మన్ కొండూరి రాజేష్, శంకర్, ముమ్మడి స్వామి,కంచర్ల రవి,జములపూరి రాజేందర్,గడ్డమీది గంగయ్య,రమేష్,కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.






