20 August, 2026 | 11:49 PM

అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు

20-08-2026 11:12 PM

రెండు ట్రాక్టర్లు సీజ్, కేసు నమోదు: ఎస్సై శేఖర్ రెడ్డి

మహమ్మదాబాద్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంటెడ్ మండల పరిధిలోని సల్కర్ పేట గ్రామంలో అనుమతి లేకుండా ఇసుక తరలించడంతో వాటిని గుర్తించి స్విచ్ చేయడం జరిగింది. నిత్యం చెబుతున్నప్పటికీ కొందరు అక్రమ ఇసుక కు అలవాటు పడిన వ్యక్తులు అలాగే తరలించేందుకు ముందుకు వెళ్లడం సరికాదని ఇకనైనా మానుకోవాలని ఆదేశించారు. చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టంగా వ్యవహరిస్తే శాఖ పరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనకు లోబడి ఇసుక రవాణా జరగాలని అక్రమంగా రవాణా చేస్తే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.