calender_icon.png 30 October, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగతనం చేస్తూ కెమెరాకు చిక్కిన డీఎస్పీ.. కేసు నమోదు

30-10-2025 09:32:34 AM

భోపాల్: మధ్యప్రదేశ్ భోపాల్‌లోని తన స్నేహితురాలి ఇంటి నుంచి డబ్బు, మొబైల్ ఫోన్ దొంగిలించినందుకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (Deputy Superintendent of Police) కల్పనా రఘువంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన రాష్ట్ర పోలీసులకు ఇబ్బంది కలిగించింది. సోషల్ మీడియాలో ఆరోపించిన సంఘటన సీసీటీవి ఫుటేజ్ వైరల్ అయిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భోపాల్‌లోని జహంగీరాబాద్ ప్రాంతంలో నివసించే ఆమె స్నేహితురాలు ప్రమీలా తివారీ డీఎస్పీ రఘువంశీపై ఆరోపణ చేశారని ఒక పోలీసు అధికారి మీడియాతో అన్నారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. రఘువంశీ తన ఇంటి నుండి రూ.2 లక్షల నగదు, మొబైల్ ఫోన్‌ను దొంగిలించారని ఆరోపిస్తూ ప్రమీలా తివారీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన బిడ్డ స్కూల్ ఫీజు కోసం రూ.2 లక్షల నగదును తన మొబైల్ ఫోన్‌తో పాటు ఒక బ్యాగులో ఉంచుకున్నానని తివారీ పోలీసులకు తెలిపింది. తాను స్నానం చేస్తుండగా రఘువంశీ తన ఇంట్లోకి ప్రవేశించి తన బ్యాగులోని నగదు, ఫోన్‌ను తీసుకుందని ఆమె ఆరోపించింది. తివారీకి అనుమానం వచ్చి ఆమె సీసీటీవీ ఫుటేజ్‌ను తనిఖీ చేసింది. అందులో రఘువంశీ తన ఇంట్లోకి ప్రవేశించడం, బయటకు వెళ్లడం స్పష్టంగా కనిపించింది.

బుధవారం భోపాల్ పోలీసులు షేర్ చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లో రఘువంశీ చేతిలో నోట్ల కట్టతో వెళ్తున్నట్లు కూడా కనిపిస్తోంది. సీసీటీవీ ఆధారాల ఆధారంగా తివారీ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. రఘువంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, పోలీస్ హెడ్ క్వార్టర్స్ డీఎస్పీ రఘువంశీకి డిపార్ట్‌మెంటల్ నోటీసు కూడా జారీ చేసిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. రఘువంశీ ఇంటి నుంచి దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌ను తరువాత స్వాధీనం చేసుకున్నప్పటికీ, రూ. 2 లక్షల నగదు జాడ ఇంకా తెలియలేదని కల్పన రఘువంశీ ప్రస్తుతం పరారీలో ఉందని పోలీసు అధికారి తెలిపారు.