calender_icon.png 30 October, 2025 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంపు ప్రాంతాల్లో మంత్రి కొండా సురేఖ పర్యటన

30-10-2025 10:57:39 AM

హైదరాబాద్: మొంథా తుఫాన్(Cyclone Montha) కారణంగా వరంగల్, హన్మకొండ జిల్లాలలో అతి భారీ వర్షాలు కురవడంతో  వరంగల్, హనుమకొండ నగరాలు నీట మునిగాయి. హన్మకొండ వరంగల్ రెండు జిల్లాల్లోనూ 115 పైగా కాలనీలు  వరద నీటిలో చిక్కుకోవడంతో సహాయక చర్యలు  కొనసాగుతున్నాయి. మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరంగల్ పరిధిలోని ఎన్ఎన్ నగర్,  బీఆర్ నగర్ లో వరద ముంపు ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులను పరామర్శించి ఆదుకుంటామని వారికి భరోసా  ఇచ్చారు.  బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడానికి అధికారులను అలెర్ట్ చేస్తున్నారు.

మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షం కురిసింది. కొన్ని గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. వరంగల్ లో రికార్డు స్థాయిలో 42.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షంతో వరంగల్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. నిన్నటి భారీ వర్షానికి పలు కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. వరంగల్- హనుమకొండ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు.