30-10-2025 10:46:21 AM
ప్రజా రవాణా దారి మళ్లింపు – భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం
నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): మొంథా తుఫాను ప్రభావంతో నాగర్ కర్నూల్ జిల్లాలో(Nagarkurnool District ) కురిసిన భారీ వర్షాలకు చెరువులు కుంటలు నిండి ప్రధాన రోడ్ల వెంట నాలుగు పారుతున్నాయి దీంతో ప్రధాన రహదారులన్నీ మూతపడ్డాయి. గురువారం ఉదయం నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని లత్తిపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారిపై దుందుభి వాగు అలుగు ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. వాగు ప్రవాహం పెరగడంతో రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రజా రవాణాను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు. వర్షాల కారణంగా నీటి మట్టం పెరుగుతుండటంతో డిండి అలుగు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగు నీరు తగ్గే వరకు వాహనాలు, ప్రజలు రాకపోకలు చేయకుండా చూసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. అదే సమయంలో సిబ్బందికి భద్రతా ఏర్పాట్లు మరింత బలోపేతం చేయాలని సూచించారు.