calender_icon.png 30 October, 2025 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే వంతెన నిర్మాణం.. వాహనాలపై క్రేన్ పడి ఇద్దరు మృతి

30-10-2025 12:03:52 PM

ధార్: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని పితంపూర్‌లో గురువారం నాడు భారీ ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెనపై(Under Construction Rail Bridge) పనిచేస్తున్న భారీ క్రేన్ అకస్మాత్తుగా బోల్తా పడింది. దీంతో టాటా మ్యాజిక్ వ్యాన్, పికప్ ట్రక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ప్రయాణిస్తున్న బైకర్‌తో సహా మరికొందరు కూడా చిక్కుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకునిసహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

మృతదేహాలను బయటకు తీసిన తర్వాతే వారి గుర్తింపులు తెలుస్తాయని అధికారులు తెలిపారు. పారిశ్రామిక నగరం పితంపూర్‌లోని సాగౌర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నిర్మాణ పనులు జరుగుతుండగా క్రేన్ ఒక భారీ స్తంభాన్ని కదిలిస్తోంది. అకస్మాత్తుగా అది సమతుల్యత కోల్పోయి వంతెన సర్వీస్ రోడ్డుపై పడిపోయింది. క్రేన్ బరువు చాలా ఎక్కువగా ఉండటంతో పికప్ వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. దీనితో అందులో ఉన్నవారు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. సాగౌర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ప్రకాష్ సరోడ్, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. భారీ క్రేన్ తొలగించిన తర్వాతే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం  తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు.