30-10-2025 09:16:18 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గురువారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్(Video Conference) నిర్వహించనున్నారు. మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రేవంత్ రెడ్డి పరిస్థితులపై సమీక్షించనున్నారు. మొంథా తుపాన్(Cyclone Montha) ప్రభావంపై ముఖ్యమంత్రి బుధవారం నాడు అధికారులను ఆరా తీశారు. మొంథా తుఫాను కారణంగా సంభవించిన భారీ వర్షాల కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం, పశువుల నష్టాన్ని నివారించడానికి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్ర యంత్రాంగాన్ని, ముఖ్యంగా జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని ఆదేశించారు.