11 August, 2026 | 1:49 AM

పిలిస్తే ఆడేందుకు సిద్ధం

11-08-2026 12:00 AM

నా చేతుల్లో ఏమీ లేదు

భువనేశ్వర్ వ్యాఖ్యలు

లక్నో, ఆగస్టు 10: టీమిండియా పేస్ ఎటాక్‌లో బుమ్రాతో సహా పలువురు కీలక బౌలర్లు గాయాల బారిన పడుతూ సిరీస్ లకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ను జాతీయ జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దేశవాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ నిలకడగా రాణిస్తున్న భువీని సెలక్టర్లు పట్టించుకోవడం లేదు. తాజాగా తన రీఎంట్రీపై భువీ కీలక వ్యాఖ్యలు చేశాడు. యూపీ టీ20 లీగ్లో లక్నో ఫాల్కన్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న భువనేశ్వర్ 2027 వన్డే ప్రపంచ కప్లో ఆడే అవకాశంపై స్పందించాడు.

జాతీయ జట్టు నుంచి పిలుపు వస్తే తాను ఎందుకు వద్దంటానని ప్రశ్నించాడు. భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిం చేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనన్నాడు. అయితే తన పని క్రికెట్ ఆడటమేననీ, సెలక్షన్ తన చేతుల్లో లేదన్నాడు. ప్రస్తుతం యూ పీ టీ20 లీగ్లో ఆడేందుకు వచ్చాననీ, నిలకడగా రాణించడంపైనే దృష్టి పెట్టానని వివ రించాడు. ఐపీఎల్లోనూ వికెట్లు సాధించి మ్యాచ్లు గెలిపించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. తనను తాను ఇంకా నిరూపించుకునేందుకు మాత్రం ఆడడం లేదని భువీ వ్యాఖ్యానించాడు.

తనను ఎంపిక చేయాలా? వద్దా? అన్నది సెలెక్టర్ల నిర్ణయమని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుత ప్రదర్శన చేసిన భువీ 28 వికెట్లు పడగొట్టి వరుసగా రెండోసారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే దేశవాళీ క్రికెట్ లోనూ కుర్రాళ్లకు పోటీగా మెరుగ్గానే రాణిస్తున్నాడు. ఈ ప్రదర్శనలతోనే అతనికి మరో అవకాశం ఇవ్వాలంటూ పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. కానీ హెడ్ కోచ్ గంభీర్ మాత్రం 2027 వరల్ కప్ లో యువ బౌలర్లపైనే ఫోకస్ పెట్టాడు. ఇదిలా ఉంటే యూపీ టీ20 లీగ్ ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానుంది. 24 రోజుల పాటు మొత్తం 34 మ్యాచ్లు జరగనున్నాయి.