నీ ప్రయత్నాలు ఆపొద్దు
11-08-2026 12:00 AM
షమీకి జహీర్ ఖాన్ సూచన
ముంబై, ఆగస్టు 10: భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భవిష్యత్తుపై మాజీ క్రికెటర్ జ హీర్ ఖాన్ ఆసక్తికర వ్యా ఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత సెలెక్టర్ల ఆ లోచనల్లో షమీకి చోటు కనిపించడం లేదని.. అయినప్పటికీ అతడు తన ప్రయత్నాలను ఆపొద్దని సూచించాడు. 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని భారత జట్టు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో అతడి స్థానాన్ని భర్తీ చేసే ప్రత్యామ్నాయాలపై సెలెక్టర్లు దృష్టి సారించారు. ఈ క్రమంలో జహీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.






