11 August, 2026 | 3:06 AM

ఇంగ్లాండ్ క్రికెటర్ విధ్వంసం

11-08-2026 12:00 AM

వన్డే కప్‌లో అరుదైన రికార్డ్

లండన్, ఆగస్టు 10 : ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు అనగానే భారత డా షింగ్ క్రికెటర్ యువరాజ్ సింగే గుర్తొస్తాడు. 2007 టీ20 ప్రపంచకప్ లో బ్రాడ్ బౌలింగ్ ను ఉతికారేస్తూ యువీ ఆరు సిక్సర్లు బాదాడు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఆ ఫీట్ నమోదైంది. ఇం గ్లాండ్లో జరుగుతున్న దేశవాళీ టోర్నీ వన్డే కప్లో హాంప్షైర్ బ్యాటర్ టోబీ ఆల్బర్ట్ తన విధ్వంసకర బ్యాటింగ్తో యువీని గుర్తు చేశాడు.

అయితే యువీ లా వరుసగా కాకుండా తాను రెండు ఓవర్లలో వరుసగా ఎదుర్కొన్న ఆరు బంతులను సిక్సర్లుగా మలిచాడు. మొ దట నాంటెస్ట్ వేసిన ఓవర్ చివరి రెం డు బంతులను టోబీ ఆల్బర్ట్ సిక్సర్లుగా మలిచాడు. ఆ తర్వాత ఓవర్లో బ్యాటర్ జేక్ లెమాన్ మొదటి రెండు బంతులను ఎదుర్కొనగా.. ఆ సమయంలో టోబీ ఆల్బర్ట్ నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాడు.

మూడో బంతికి స్ట్రైక్ అందుకున్న ఆల్బర్ట్.. ఓలీ కిర్ట్లీ వేసిన తర్వాతి నాలుగు బంతులను ప్రేక్షకుల గ్యాలరీలోకి కొట్టి మొత్తం వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు.ఆల్బర్ట్ కేవలం 37 బంతుల్లోనే 86 పరుగులు బాదాడు. ఆల్బర్ట్ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. ససెక్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్బర్ట్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా హాం ప్షైర్ తమ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 383 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. 384 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ససెక్స్ కూడా తీవ్రంగానే ప్రయత్నించింది. కానీ చివర్లో ఒత్తిడికి లోనై 332 పరుగులకు ఆలౌటైంది.