సమస్యల పరిష్కారానికే భూభారతి
* అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్
చిగురుమామిడి, జూన్ 18(విజయక్రాంతి): ప్రభుత్వం రైతుల భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నదని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తెలిపారు. మండలంలోని రామంచ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులో ఆర్డీవో మహేశ్వర్ తో కలిసి బుధవారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు భూ సమస్యలు ఉండడం వల్ల ప్రభుత్వం మరోసారి వాటిని సవరించేందుకు భూభారతి రె వెన్యూ సదస్సులను ఏర్పాటు చేసిందన్నా రు. సమస్యలు ఉన్న రైతులు ఈ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ముద్ధ సాని రమేశ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అరుణ్ కు మార్, తారా దేవి, పంచాయతీ కార్యదర్శి గా జుల శ్రీలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నా రు. రామంచలో 130 దరఖాస్తులు రైతుల వ ద్ద నుంచి స్వీకరించామని తాసిల్దార్మ్రేష్‌తెలిపారు.




