calender_icon.png 19 July, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పేదల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం

19-06-2025 12:00:00 AM

ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ 

మహబూబాబాద్, జూన్ 18 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి మారుపేరు అని, పేదల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 107 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

అలాగే 69 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన నగదు చెక్కులను అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ అమలు చేస్తున్నామని, అలాగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రజలను కోరారు.