19-06-2025 12:00:00 AM
118 జీవోతో ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్
ఎల్బీనగర్, జూన్ 18 : ”సుధీర్ రెడ్డి నీ రక్తంలోనే మోసం ఉంది... జీవో 118 పేరు మీద ఇంకా ప్రజలను మోసం చే స్తున్న చీటర్ లోఫర్ వి నీవు‘ అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ ధ్వజమెత్తారు. జీవో 118పై ఇటీవల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మధుయాష్కీపై త ప్పుడు ఆరోపణలు చేసిన నేపథ్యంలో జీవో 118 బాధిత కాల నీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో కలిసి బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని సాగర్ కాంప్లెక్స్ లో బుధవారం ప్రత్యేక సమావే శం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ కాలనీ సంక్షేమ సంఘాలు ప్రతినిధులు మాట్లాడుతూ..
జీవో 118తో మమ్మల్ని అక్రమణదారులుగా ముద్ర వేశారని ఆవేదన వ్య క్తం చేశారు. కట్టుకున్న భవనాలకు మూడు రేట్లు అధికంగా టాక్స్ లు విధిస్తున్నారని తెలిపారు. అనంతరం మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 118.. లొట్ట పీస్ జీవో అన్నారు. ప్రజలు తమ రక్తం ధార పోసి,చెమట చుక్కలతో కష్టపడి సంపాదించుకున్న ప్లాట్లను, నిర్మించుకున్న ఇళ్లను అక్రమణదారులుగా పేర్కొంటూ జీవో 118 తీసుకురావడం దుర్మార్గమన్నారు.
జీ వో 118 వల్ల తమ ఇబ్బందులు తొలగిపోలేదని, తప్పులు తడకగా తీసుకువచ్చిన జీవో మాకు వద్దు అని ప్రజలు కోరు తుంటే.. ఇంకా అదే జీవో 118 ద్వారా కన్వీనియన్స్ డీడీలు ఇప్పిస్తామంటూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మోసపు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. ’హుడా అనుమతి పొందిన లే అవుట్ స్థలాలను కొనుగోలు చేసిన ప్రజలను జీవో 118 తో భూఆక్రమణదారులుగా చిత్రీకరించడం సిగ్గు గా అనిపించటం లేదా సుధీర్ రెడ్డి..’ అని పేర్కొన్నారు.
అప్పటికే జీవో 168 ఉండగా.. జీవో 118 పనికి రాదు అని తెలిసి కూడా కన్వీనియన్స్ డీడీలు ఇప్పించారన్నారు. రిజిస్ట్రేషన్ బాధిత కాలనీ ప్రజల సమస్యను ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. ఈనెల 25 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారితో సమావేశం ఉం టుందని.. శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తానని మధుయా ష్కీ పేర్కొన్నారు. రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి గారు మాట్లాడుతూ..
సుధీర్ రెడ్డి స్వార్థ రాజకీయాల కారణంగా రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కాలేదని పే ర్కొన్నారు. నిషేధిత జాబితాలోని 22ఏ నుంచి తమ కాలనీల సర్వే నెంబర్లను తొలగింపజేసేలా చూడాలని స్థానికులు కోరారు. సమావేశంలో యువజన కాంగ్రెస్ నేత గణేష్ రెడ్డి, కార్పొరేటర్లు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, రావుల వెంకటేశ్వర రెడ్డి,
సుజాత నాయక్, కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రెటరీ అంగోత్ వెంకటేష్, డివిజన్ అధ్యక్షులు మకుటం సదాశివుడు, కుట్ల నర్సింహ యాదవ్, శ్రీపాల్ రెడ్డి, వేణుగోపాల్ యాదవ్, సురేందర్ రెడ్డి, బుడ్డ సత్యనారాయణ, చెన్నగోని రవీందర్, టార్గెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, నేలపాటి రామారావు, గణేష్ నాయక్ తదితరులుపాల్గొన్నారు.