నేటి నుంచి భూభారతి రెవెన్యూ సదస్సులు
వనపర్తి, జూన్ 2 (విజయక్రాంతి): జూన్ 3వ తేదీ నుంచి వనపర్తి జిల్లాలోని అ న్ని మండలాల గ్రామపంచాయతిల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సోమ వారం ప్రకటనలో తెలిపారు. ప్రతి మండలం నుండి రెండు బృందాలను ఏర్పాటి చేసుకోవడం జరిగిందని, ఉదయం 9.00 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఒక్కో బృందం ఒక్కో గ్రామ పంచాయతీలో పర్యటించి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్న ట్లు తెలిపారు.
జూన్ 20 వరకు ప్రతి మండలంలో షెడ్యూల్ వారిగా నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పెదాలను కోరారు. రెవెన్యూ సదస్సు తమ గ్రామంలో ఏ రోజు నిర్వహిస్తారో తెలుసుకొని భూ సమస్యలు ఉన్న ప్రజలు నిర్ణిత ప్రొఫార్మలో తమ సమస్యలను దరఖాస్తు చేసుకొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.






