15 June, 2026 | 4:05 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు బెయిల్

19-08-2024 11:42 AM

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో భుజంగరావుకు 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని సూచించింది నాంపల్లి కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు ఏ2గా ఉన్నారు. మార్చ్ 23న భుజంగరావును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.