సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క
19-08-2024 11:19 AM
హైదరాబాద్: రక్షా బంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ మహిళా నేతలు రాఖీలు కట్టారు. మంత్రి సీతక్క ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. ముఖ్యమంత్రికి రాఖీలు కట్టిన వారిలో ఎంపీ కడియం కావ్య కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి, రాగమయి, కోప్రోరేషన్ చైర్‌పర్సన్లు బండ్రు శోభారాణి, కాల్వ సుజాత, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద తదితరులు ఉన్నారు.






