calender_icon.png 4 December, 2024 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మికంతో పాటు అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం

04-11-2024 12:25:10 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆధ్యాత్మికంతో పాటు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించడమే కాకుండా జిల్లా కేంద్రంలో ఆలయాల నిర్మాణాలతో పాటు షెడ్ల నిర్మాణాలను మాజీ సీఎం కేసీఆర్ కోట్లు రూపాయలు కేటాయించరని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ లోని శాంతినగర్ లో గల హనుమాన్ ఆలయ కమిటీ హాల్ నిర్మాణానికి కాలనీ వాసులతో కలిసి సోమవారం మాజీ మంత్రి భూమి పూజ చేశారు. కాలనీవాసులు జోగు రామన్న ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ మేరకు జోగు రామన్న మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోకేసీఆర్ నాయకత్వంలో ఆధ్యాత్మికంతో పాటు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతను  కల్పించిందన్నారు.

ఆధ్యాత్మికం పెంపొందించినప్పుడే శాంతి స్థాపన చేకూరుతుంది అన్నారు.. యాదాద్రి టెంపుల్, నాగోబా ఆలయం తోపాటు లోక కళ్యాణార్థం యాగాలు నిర్వహించిన వ్యక్తి కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు.. గ్రామాలలో పల్లెల్లో పట్టణాలలో ఆధ్యాత్మికం పెంపొందెలా ప్రతి ఒక్కరు ఐక్యమత్యంగా పండగలను నిర్వహించుకునేందుకు షెడ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలోదేవన్న, బట్టు సతీష్, ఆశన్న, శ్రీనివాస్, సి.హెచ్ దినేష్, హన్మాండ్లు, వేదవ్యాస్, వెంకట్ రెడ్డి,  సంతోష్, కృష్ణ, నర్సాగౌడ్, పవన్, తదితరులు పాల్గొన్నారు.