28 June, 2026 | 3:46 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

మానవత్వం చాటుకున్న మంత్రి వాకిటి శ్రీహరి

12-03-2026 11:43 AM

రోడ్డు ప్రమాద బాధితులకు స్వయంగా సహాయం

షాద్‌నగర్,(విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే పరమావధిగా మంత్రి వాకిటి శ్రీహరి  ఉదారతను చాటుకున్నారు. గురువారం ఉదయం బెంగళూరు జాతీయ రహదారిపై పాల్మాకుల వద్ద జరిగిన ఘోర బైకు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు.మక్తల్ పర్యటనకు వెళ్తున్న మంత్రి, ప్రమాదాన్ని గమనించి వెంటనే తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. రక్తపు మడుగులో, భీతావహంగా ఉన్న మృతదేహాలను చూసి వెనకడుగు వేయకుండా, తన సిబ్బందితో కలిసి మంత్రి స్వయంగా వాటిని పక్కకు తొలగించారు.

వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ​అధికారిక పర్యటనలో ఉన్నప్పటికీ, ప్రోటోకాల్ కంటే ప్రాణానికే విలువిచ్చిన మంత్రి తీరుపై ప్రయాణికులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "ప్రజా ప్రతినిధి అంటే కేవలం హోదా మాత్రమే కాదు, బాధ్యత కూడా" అని ఆయన నిరూపించారని పలువురు కొనియాడారు.