15-09-2025 12:00:00 AM
సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ అజిజ్ పాషా
ఎల్బీనగర్, సెప్టెంబర్ 14 : సీపీఐ నాయకుడు భూపతి సురేశ్ పేదల మనిషి అని, నాగోల్ డివిజన్ లో పేదలు కోసం అనేక ఉద్యమాలు చేశారని పలువురు కొనియాడారు. జైపురి కాలనీలోని సీఆర్ కమ్యూనిటీ హాల్ లో ఆదివారం కామ్రేడ్ భూపతి సురేశ్ సంతాప సభ నిర్వహించారు. సభకు సీనియర్ నాయకుడు బొడ్డుపల్లి కృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ, సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజిజ్ పాషా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కామ్రేడ్ భూపతి సురేశ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జైపూర్ కాలనీలో పట్టాల పంపిణీ నుంచి శాశ్వత ఇండ్ల నిర్మాణం పథకం భూపతి సురేశ్ అనేక పోరాటాలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నాడని తెలిపారు. కార్యక్రమంలో జైపురి కాలనీవాసులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
సాయుధ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రచారి
అబ్దుల్లాపూర్ మెట్, సెప్టెంబర్ 14: తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి అన్నారు. సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుత్బుల్లాపూర్, రావినారాయణరెడ్డి ఫేజ్2 శాఖల ఆధ్వర్యంలో వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు సీపీఐ రాష్ట్ర నాయకులు ఆందోజు రవీంద్రచారి, ముత్యాల యాదిరెడ్డిల హాజరై.. జెండాలను ఆవిష్కరించారు.
సీపీఐ అబ్దుల్లాపూర్ మెట్ కార్యదర్శి అజ్మీర హరిసింగ్ నాయక్, పబ్బతి లక్ష్మణ్, పొన్నాల యాదగిరి, చిర్ర శేఖర్, బీవోసీ దాసరి ప్రసాద్, వేణుగోపాల చారి, కాటి అరుణ, వట్టి నవనీత, బాల్ రెడ్డి, దుపం నిరంజన్, లావణ్య, సుధాకర్, రేణుక శ్రీకాంత్, వినోద్, అరవింద్, ఈశ్వరయ్య, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.