15-09-2025 12:00:41 AM
- కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సంబశివరావు
జగదేవపూర్,సెప్టెంబర్ 14:ప్రజల కోసం పోరాడేది సీపీఐ పార్టీ అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సంబశివరావు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలలో భాగంగా జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం కామ్రేడ్ కుమ్మరి భూమయ్య సంస్మరణ దినం కార్యక్రమంలో అయన పాల్గొని నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సంబశివరావు మాట్లాడుతూ కుమ్మరి భీమయ్య దౌలాపూర్ గ్రామానికి చేసిన సేవలు గుర్తు చేశారు.
1947 లో సెప్టెంబర్ 11 కమ్యూనిస్ట్ లు సాయిదా రైతాంగ పోరాటానికి పిలుపునిచ్చారన్నారు. నిజాం చేతుల్లో ఉన్న హైదరాబాద్ సంస్థాన పాలన నుండి విముక్తి కోసం చేసిన పోరాటం లో 3500 మంది అమరులయ్యారన్నారు. ఆనాటి దారుణ కాండకు ప్రతికారంగా ప్రతి సంవత్సరం వారం రోజులు వారోత్సవాలు నిర్వహించడం అనవాయితీ అని పేర్కొన్నారు. కమ్యూనిస్టులు ప్రజల కోసం వారి జీవితాలను త్యాగం చేశారన్నారు.
అమరులు రావి నారాయణ రెడ్డి, సురవరం సుధాకర్ రెడ్డి, నీలం రాజశేఖర్ రెడ్డి, పుచ్చల పల్లి సుందరయ్య లాంటి వారు ఎందరో పేదల కోసం పోరాడి తనువు చాలించిన నాయకులన్నారు. కమ్యూనిస్టులకు కులం లేదన్నారు. ఏ దేశంలో పుట్టినా, ఎక్కడ ఉన్నా రక్తం ఒక్కటే అన్నారు. అధికారం ఉన్న లేకపోయినా ప్రజల కోసం కొట్లాడేది కమ్యూనిజం పార్టీ మాత్రమే దర్మం వైపు నిలబడేది కమ్యూనిజం పార్టీ అన్నారు. అనంతరం రిటైర్డ్ జడ్జి జయ సూర్య మాట్లాడుతూ డా బి ఆర్ అంబేద్కర్ బాటలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దయానంద రెడ్డి, జిల్లా కార్యదర్శి మంద పవన్,మహేందేర్ రెడ్డి, బంగారు రెడ్డి,మాజీ ఎంపిటిసి జయమ్మ,కొట్టాల యాదగిరి,మనోహర్ తదితరులు పాల్గొన్నారు.