15-09-2025 12:00:00 AM
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల సెప్టెంబర్ 14:మాజీ మంత్రి ప్రజ ల్లో ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నిన గద్వాల నియోజకవర్గ అభివృద్ధి, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కో సమే ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.గడిచిన ఏడేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తాను చే సిన పనులను ప్రజల ముందుకు తీసుకొచ్చారు.అధిష్టానంతో కొట్లాడి గద్వాలకి మెడి కల్ కాలేజీ రూ.128 కోట్లు, నర్సింగ్ కాలేజ్ రూ.34.2కోట్ల నిధులను తీసుకువచ్చిన ఘనత తనదేనన్నారు.
జిల్లా ప్రభుత్వాసుపత్రికి రూ.2.3 కోట్లు క్రిటికల్ కేర్ భవన ని ర్మాణం కోసం రూ.23,75కోట్లు, ఆసుపత్రికి ఆక్సిజన్ ప్లాంటు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు అభివృద్ధి కోసం 12 కోట్లతో నిర్మాణం , రూ.6 కోట్లతో బస్టాండ్ రూపురేఖలను మార్చామన్నారు. జిల్లా కోర్టు ని ర్మాణానికి స్థల సేకరణ పూర్తి చేసి భవన ని ర్మాణం కోసం రూ. 110 కోట్ల నిధులు మం జూరు చేయించి త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభం కానున్నాయని తెలిపా రు.
రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు 33 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం తో రూ. 581 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నట్టు అందుకు కృషి చేసిన ఘనత తమదేమన్నారు.మహిళ పీజీ కళాశాల స్టడీ ,సర్కిల్ ద్వారా విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్, మహిళ గురుకుల డిగ్రీ కళాశాల, 1300 వందల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇటీవల 684 మంది లబ్ధిదారులకు ఇల్లు పంపిణీ వంటి పలు అభివృద్ధి పనులు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గద్వా ల్ నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి క మ్యూనిటీ హాల్స్ రూ. 45.20 కోట్లతో నిర్మాణం జరిగిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమమే తమ దేయంగా పనిచే స్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.