14 July, 2026 | 11:44 AM

Breaking News

కల్లూరులో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్   •   కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   •   విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •  

భువనగిరి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా

04-10-2025 12:00 AM

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

వలిగొండ, అక్టోబర్ 3 (విజయక్రాంతి): భువనగిరి నియోజకవర్గం పరిధిలోని సాగునీటి కాలువలు అన్నిటిని పూర్తిచేసి  సస్యశ్యా మలం చేస్తానని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం వలిగొండ మండలంలోని పహిల్వాన్ పురం గ్రామం పరిధిలో గల బునాదిగాని చెరువును మరియు కాలువలను ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించి అలుగు పోస్తున్న చెరువులకు పూలు చల్లి పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దా కాలంగా గత ప్రభుత్వం బునాదిగాని కాలువను పూర్తి చేయలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని కాలువలు అన్నిటిని పూర్తి చేసేందుకు నిధులను మంజూరు చేయించడం జరిగిందని పనులు త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. బునాదిగాని చెరువు ద్వారా టేకులసోమవారం, పహిల్వాన్పురం, రెడ్లరేపాక, కంచనపల్లి, పులిగిల్ల తదితర గ్రామాలకు సాగునీరు అందుతుందని దీంతో భూగర్భ జలాలు కూడా గణనీయం గా పెరుగుతాయన్నారు. రైతుల కండ్లల్లో ఆనందం చూసేందుకు నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాల్వను పూర్తి చేస్తానని అన్నారు.  పాశం సత్తిరెడ్డి, బత్తిని సహదేవ్, పల్చం సతీష్, మాదశంకర్ పాల్గొన్నారు.