04-10-2025 12:00:00 AM
సూర్యాపేట, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో ప్రముఖ వ్యాపారులు, వాసవి భవన్ ట్రస్ట్ చైర్మన్ తోట శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వాసవి భవన్ నూతన భవనంకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త సుధాకర్ పివిసి కంపెనీ చైర్మన్ మీలా మహదేవ్ పాల్గొనీ మాట్లాడారు.
వాసవి భవన్ సూర్యాపేట పట్టణంలో ఆర్యవైశ్యులకు ఒక వేదికగా ఉండబోతుందని వ్యాపారులకు కావలసిన సమాచారం ఇవ్వడానికి శిక్షణ కార్యక్రమాలు చేయడానికి, సెమినార్ లు నిర్వహించడానికి, జీఎస్టీ వంటి వాటిమీద అవగాహన సదస్సులు నిర్వహించడానికి వాసవి భవన్ కేంద్రంగా ఉంటుందని వారు అన్నారు. కరోనా సమయంలో వాసవిభవన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
మహిళలు కుట్టు మిషన్ల ద్వారా మాస్కులు తయారుచేసి కరోనా సమయంలో ప్రజలకు అందజేశారని వారు అన్నారు. ఈ భవన నిర్మానానికి సహకరిస్తున్న సుధాకర్ పివిసి ఎండి మీలా మాహదేవ్ కు , దాతలకు, ట్రస్టు సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్య సంఘం అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వర్లు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, వాసవి భవన్ ట్రెజరర్ మిర్యాల సుధాకర్, సెక్రటరి బిక్కుమల్ల కృష్ణ,కోటగిరి రాధాకృష్ణ, ఇమ్మడి సోమనర్సయ్య, కక్కిరేణి చంద్రశేఖర్, సింగిరికొండ రవీందర్, రాచర్ల కమలాకర్, రాచర్ల వెంకటేశ్వర రావు, కలకోట లక్ష్మయ్య, రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.