04-10-2025 12:00:00 AM
నివాళులర్పించిన ఎమ్మెల్యే వేముల
నకిరేకల్, అక్టోబర్ 3 : మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టైగర్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం వారి పార్థివదేహాన్ని హైదరాబాదు నుండి సూర్యాపేటకు తీసుకెళ్తున్న సందర్భంగా నకిరేకల్ మెయిన్ సెంటర్లో నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం నాయకత్వన దామోదర్ రెడ్డి పార్దివ దేహానికి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి పూలమాల లేసి నివాళులర్పించారు. నాయకులు దుబ్బాక నర్సింహా రెడ్డి ,చామల శ్రీనివాస్, పన్నాల రాఘవరెడ్డి, ఒంటెపాక ఏసు పాదం లింగాల వెంకన్న, కోట మల్లికార్జున్ రెడ్డి, గాజుల సుకన్య శ్రీనివాస్, పెద్ది చుక్కయ్య, పన్నాల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు..
యాదాద్రి భువనగిరి అక్టోబర్ 3 ( విజయ క్రాంతి ): మాజీ మంత్రి టైగర్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని మాజీ ప్రధాన కార్యదర్శి పి ప్రమోద్ కుమార్ అన్నారు. ఆయన మృతి పట్ల భువనగిరి కాంగ్రెస్ పార్టీ చేసింది. శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఆధ్వర్యంలో దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మున్సిపల్ మాజీ చైర్మన్ జహంగీర్ , గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిస్తి, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్ మాజీ కౌన్సిలర్ రాచమల్ల రమేష్ జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సామల రవీందర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెండ లాల్ రాజ్ భువనగిరి పట్టణ సేవాదాల అధ్యక్షులు ఠాకూర్ ప్రకాష్ యూత్ కాంగ్రెస్ నాయకులు సాల్వేరు ఉపేందర్ భువనగిరి పట్టణ రైతు సంఘం నాయకులు నాయిని వెంకటేష్ సీనియర్ మైనార్టీ నాయకులు ఎండి షరీఫ్ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బర్రె నరేష్ మార్కెట్ డైరెక్టర్ రంగా కృష్ణ గారు బత్తిని జితేందర్ 29వ వార్డు వైస్ ప్రెసిడెంట్ గ్యాస్ చిన్న అండ్ సురేందర్ పందుల . ప్రచార కమిటీ నాయకులు దర్గాయి దేవేందర్ మాజీ సివిల్ కాంట్రాక్టర్ శంకరయ్య గారు యాదవ్ గారు ఎండి జానీ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
కోదాడలో..
కోదాడ అక్టోబర్ 3; కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దామోదర్ రెడ్డి మృతి పట్ల నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు లు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. మాజీ సర్పంచులు పారా సీతయ్య, ఎర్నెని బాబు, గంధం యాదగిరి,బాల్ రెడ్డి, పాలూరి సత్యనారాయణ, పిడతల శ్రీను, అలీ భాయ్, బాగ్దాద్, భాజాన్, ముస్తఫా, సూర్యనారాయణ, పాండు, పుల్లయ్య, ప్రసాద్, షఫీ, ఖలీల్ పాల్గొన్నారు.