కొత్తకొండ, మల్లారంలో సైకిల్స్ పంపిణీ
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) ః హనుమకొండ జిల్లాలోనికొత్తకొండ, మల్లారం గ్రామాల్లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సైకిల్స్ పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది .ఈ సందర్భంగా మీడియాతోరాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాల తో ముందుకు సాగాలని అన్నారు.
బిజెపి మండల శాఖ అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రమంత్రి బండి సంజయ్ విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సైకిల్స్ పంపిణీ ఏర్పాటు చేసినారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపల్లి పృథ్వీరాజ్, మండల నాయకులు శక్తి కేంద్రం ఇంచార్జిలు దొంగల వేణు, పెద్ది శివ,కాలేరు వికాస్, దొంగల రాన ప్రతాప్, బుజ్జపురి పృథ్వీరాజ్ మహిళా నాయకురాలు అంబిర్ కవిత, సిద్ధమల్ల రమేష్, కంకల సదానందం, పునపర్తి రమేష్, పయ్యావుల రాజు, రెడ్డి సమ్మయ్య,సాయి వంశీ, మరుపాక వివేక్, గుమోలాపురం మహేష్, శ్రీనివాస్, కోల రమేష్ తదితరులు పాల్గొన్నారు






