ధర్పల్లిలో సైకో వీరంగం
కత్తెరతో దాడి ః నలుగురికి తీవ్ర గాయాలు
ధర్పల్లి, సెప్టెంబర్ 2 : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో ఓ సైకో కత్తెరతో దాడులకు తెగబడ్డాడు. ఈ దాడిలో అతని భార్య కూతురుతో పాటు అడ్డొచ్చిన మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది ధర్పల్లి గ్రామంలోని కొత్త గా ఏర్పడిన కాలనీలో నివాసం ఉండే నాగరాజు తన భార్యకు మధ్య కొన్ని రోజులుగా గొడవలు కొనసాగుతున్నాయి.
రాత్రి తనపై భార్యపై అనుమానంతో ముందుగా ఆమెపై దాడి చేయగా ఆమె తీవ్ర గాయాల పాలయింది ఆయన భార్య ను కత్తెరతో పొడవడంతో ఆమె తీవ్ర గాయాలయ్యాయి తల్లి పై దాడిని చూసి పరిగెత్తుకొచ్చిన తన కూతురు సుజాత పై కూడా నిందితుడు దాడి జరిపాడు. దాడిని అడ్డుకోవడానికి వచ్చిన కిరాణా దుకాణం యజమాని భువనేశ్వరి కూడా దాడికి పాల్పడ్డాడు. దాడికి పాల్పడిన నాగరాజు భార్య పరిస్థితి విషమంగా మారడంతో నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి ఉటావుడిన తరలించారు. భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ధర్పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






