26 May, 2026 | 1:54 AM

చిన్నారులకు సైకిళ్లు అందజేత

26-05-2026 12:00 AM
  1. 70 మందికి అందజేసిన జగ్గారెడ్డి
  2. మరో 156 మంది చిన్నారులకు టోకెన్స్ అందజేత
  3. సంగారెడ్డిలో ఇప్పటివరకు 400 మందికి సైకిల్స్ పంపిణీ

సంగారెడ్డి, మే 25 (విజయక్రాంతి): సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సైకిల్స్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా మరో 70 మంది చిన్నారులకు జగ్గారెడ్డి సైకిల్స్ పంపిణీ చేశారు. 8 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులకు సైకిల్స్ అందించేలా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 400 సైకిల్స్ పంపిణీ పూర్తి అయ్యింది. తమ కార్యాలయంలో ఆధార్ జిరాక్స్ ఇచ్చి, పేర్లు నమోదు చేసుకున్న అందరికీ విడతల వారీగా సైకిల్స్ అందిస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

మరో 156 మందికి టోకెన్స్ పంపిణీ..

సైకిల్స్ పంపిణీ కార్యక్రమం వద్దకు వచ్చి, గతంలోనే తమ పేర్లను నమోదు చేసుకున్న 156మంది చిన్నారులకు జగ్గారెడ్డి టోకెన్స్ అందించారు. వచ్చే ఆదివారం వారికి సైకిల్స్ అందిస్తామని చెప్పారు. సైకిల్స్ పంపిణీ సందర్భంగా జగ్గారెడ్డి చిన్నారులతో ముచ్చటిస్తూ సరదాగా గడిపారు. వారితో కరచాలనం చేస్తూ, హాయ్ చెబుతూ వారితో కలిసిపోయారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకుడు కూన సంతోష్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.