19 March, 2026 | 6:00 AM

2 బిలియన్ డాలర్ల పైనే బిడ్

19-03-2026 12:30 AM

తుది దశకు ఆర్సీబీ అమ్మకం ప్రక్రియ

బెంగళూరు,మార్చి 18 : ఐపీఎల్ చరిత్ర లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)అమ్మకం ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ప్ర స్తుతం రెండు కంపెనీలు మాత్రమే ఈ బిల్డింగ్ రేసులో ఉన్నాయి. స్వీడన్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ భారీ మొత్తానికి బిడ్ దాఖలు చేసినట్టు సమాచారం. అలాగే రంజన్ పాయ్ నేతృత్వంలోని కన్సార్టియం కూడా గట్టిపోటీనే ఇస్తోంది.

మొత్తానికి ఈ తీవ్రమైన పోటీ మధ్య బిడ్డింగ్ విలువ రెండు బిలియన్ డాలర్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద బిడ్‌గా నిలిచిపోతుంది. గ్లేజర్ ఫ్యామిలీ 1.8 బిలియన్ డాలర్ల వరకూ బిడ్ వేసినప్పటకీ తర్వాత రేసు నుంచి తప్పుకుంది. అలాగే కరోనా వ్యాక్సీన్ కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేసిన సీరమ్ ఇనిస్టిట్యూ ట్ సీఈవో పునావాలా కూడా ఆసక్తి చూ పించినా తర్వాత వెనక్కి తగ్గారు.

ప్రస్తుతం ఆర్‌సీబీ యజమానిగా ఉన్న డియోజియో గ్రూప్ మార్చి 31లోగా బిడ్డింగ్ ప్రక్రియ పూ ర్తి చేయాలని డెడ్‌లైన్ పెట్టుకుంది. కాగా సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గత ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను ఆర్‌సీబీ కైవసం చేసుకుంది. ఈ విజయం తర్వాత ఆ ఫ్రాంచైజీ వి లువ మరింత పెరిగింది. టైటిల్ గెలవని సీజన్లలో కూడా ఆర్‌సీబీ ఫాలోయింగ్, బ్రాండ్ వాల్యూ ఎప్పుడూ తగ్గలేదు.