2 August, 2026 | 8:13 AM

నల్లగొండ ఆర్డీఓ ఆఫీసు ఖాళీస్థలం వేలం వేయండి

24-08-2024 01:59 AM
  1. భూపరిహారం కేసులో హైకోర్టు సంచలన తీర్పు 
  2. నెలరోజు గడువు కోరిన ఆర్డీఓ  
  3. పరిహారం కోసం కోర్టును ఆశ్రయించిన బాధితుడు 

నల్లగొండ, ఆగస్టు 23 (విజయక్రాంతి):  నల్లగొండ ఆర్డీఓ కార్యాలయంలోని ఖాళీస్థలాన్ని వేలం వేసి బాధితుడికి పరిహారం చెల్లించాలని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.  నెలరోజుల సమయం ఇవ్వాలని కోర్టుకు ఆర్డీఓ అప్పీల్ చేయడంతో మన్నిం చి ఆలోగా బాధితుడికి పరిహారం చెల్లించాలనిఆదేశాలిచ్చింది. దీంతో శుక్రవారం జరగాల్సిన వేలం తాత్కాలికంగా వాయిదాపడింది. పానగల్ బైపాస్ రోడ్డు వద్ద  నిర్మించిన ప్లుఓవర్ కోసం ఓ వ్యక్తికి చెందిన భూమిని సర్వీస్ రోడ్డు నిర్మించడానికి వాడుకున్నారు.

తన భూమికి పరిహారం చెల్లించాలని బాధితుడు అనేకసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడ ంతో హైకోర్టును ఆశ్రయించాడు. పూర్వాపరాలు పరీశీలించిన కోర్టు రూ. కోటిపైగా పరిహారం చెల్లించాలని జిల్లా యత్రాంగాన్ని ఆదేశించింది. అయినా స్పందించకపోవడంతో బాధితుడు ఆర్డీఓ కార్యాలయం ఖాళీస్థలం అటాచ్మెంట్ వేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా భూమిని వేలం వేసేందుకు ఏర్పాట్లు చేయగా ఆర్డీఓ సమయం కావాలని కోర్టుకు విన్నవించడంతో వేలం వాయిదా పడింది. సెప్టెంబర్ 23వ తేదీలోగా బాధితుడికి పరిహారం చెల్లిస్తామని కోర్టుకు విన్నవించడంతో అంగీకరించింది.