పథకాలను పక్కాగా అమలుచేయాలి
ఆదిలాబాద్ ఎంపీ నగేశ్
నిర్మల్ ఆగస్టు 23 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను వందశాతం అమలు చేయాలని అధికారులను ఆదిలాబాదు ఎంపీ నగేశ్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్ర నిర్మల్ కలెక్టరేట్‌లో ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి దిశ సమన్వయ కమిటీ పమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగేశ్ మాట్లాడతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలను అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేస్తున్నాయన్నారు.
ఈ నిధులతో గ్రామా ల్లో రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్ , వైద్యం, విద్య, శిశు సంక్షేమం తదితర అభివృద్ధి పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రతి కుటుంబానిక చేయూత అందించాలన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించవద్దనిఎమ్మెల్యేలు సూచించారు. ప్రతి శాఖ అధికారి పర్యవేక్షణలోనే పనులు చేయాలన్నారు. సమా వేశంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఖానపూర్ మున్పిపల్ చైర్మన్ సత్యం, అధికారులు పాల్గొన్నారు.






