ఏఎంసీ కుర్చీ ఎవరిదో?
- అదృష్టం ఎవరిని వరించేనో
- నామినేటెడ్ పదవులపై ఉత్కంఠ
- మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిపై ఆశలు
- ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్న ఆశావహులు
- ఏఎంసీల పాలకవర్గంపై కసరత్తు
- కామారెడ్డి జిల్లాలో 10 మార్కెట్ కమిటీలు
కామారెడ్డి, ఆగస్టు23(విజయక్రాంతి): జిల్లాలోని మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించడానికి కసరత్తు జరగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ అనుచరులకు ఆ పదవులను కట్టబెట్టేందుకు నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు ముగియడ ంతో ఇప్పటివరకు వేచి చూసిన ద్వితీయ శే ణి నాయకులు తమకు నామినేటెడ్ పదవు లు కట్టబెట్టాలని ఎమ్మెల్యేల వద్దకు క్యూ కడుతున్నారు.
జిల్లాలో 10 మార్కెట్ కమిటీలు..
జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తం 10 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఒక్కో కమిటీకి చైర్మన్‌తో పాటు 13మంది వరకు డైరెక్టర్లను నియమిస్తారు. వీరి నియామక బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యే లేదంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఎంపిక చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తారు. వీరి ప్రతిపాదనల కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసి పాలకవ ర్గాలను నియమిస్తుంది.
ఆశావహులు వీరే..
కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ నిమ్మ మోహన్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్న ట్లు తెలుస్తోంది. భిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్సీకి రిజర్వ్ కావడంతో బీబీపేట మండలం జనగామకు చెందిన మాజీ సర్పం చ్ రాజు, కాచాపూర్‌కు చెందిన బైండ్ల సుదర్శన్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఎల్లారెడ్డిని యోజకవర్గంలోని సదాశివనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్టీకి రిజర్వ్ కావడంతో సదాశివనగర్ మండలం యాచారం తండాకు చె ందిన సంగ్యా పేరును ప్రపోజల్ చేశారు.
గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ బీసీకి రిజర్వేషన్ కావడంతో చాలామంది పోటీ పడుతున్నారు. పోటీలో ఉన్న వారే ఒకరి పేరును ప్రపోజల్ చేయాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు సూచించడంతో గాంధారి మండలం గండివెట్ కు చెందిన పరమేశ్, వై స్ చైర్మన్‌గా గాంధారికి చెందిన ఆకుల లక్ష్మ ణ్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ రేస్‌లో ఎల్లారెడ్డి మాజీ సర్పంచ్ చెన్న లక్ష్మణ్, జంగమాయిపల్లికి చెందిన వెంకట్‌రాంరెడ్డి ప్రయత్నాలు చే స్తున్నారు. వెంకట్‌రాంరెడ్డి పేరు ఖరారు కా నున్నట్లు తెలుస్తుంది. బాన్సువాడ మార్కెట్ కమిటీ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో మాసాని రవీందర్‌రెడ్డి సతీమణితో పాటు దాసరి శ్రీనివాస్, నార్ల ఉదయ్ కుమార్ సతీమణులు ప్రయత్నాలు చేస్తున్నారు.
జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మార్కెట్ కమిటీ ఎస్సీ మహిళకు రిజర్వేషన్ కావడంతో విలాస్ గైక్వాడ్ దేవీదాస్, నాగనాథ్, అమూ ల్, ప్రజ్ఞకుమార్‌లు తమ సతీమణుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పిట్లం మార్కెట్ క మిటీ చైర్మన్‌గా జై ప్రదీప్ శివకుమార్, హన్మ ండ్లు, మనోజ్‌కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారా వు ఆశీస్సుల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
బిచ్కుంద మార్కెట్ కమిటీ చై ర్మన్‌కు షెట్కార్ రమేశ్, పాషా, గోపాల్‌రెడ్డి, సోపాన్‌లు తమ సతీమణుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే మార్కెట్ కమి టీ పాలకవర్గాలను ప్రభుత్వం ప్రకటించనుం ది.ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు పడరాని పాట్లు పడుతున్నా రు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా పనిచేసి న తమకు మార్కెట్ కమిటీ పదవిని కట్టబెట్టాలని కోరుతున్నారు.






