28 June, 2026 | 2:10 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

జుక్కల్‌లో బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్

16-03-2026 12:00 AM
  1. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం తండా సర్పంచ్ వార్డు సభ్యులు

నిజాంసాగర్ మార్చి 15( విజయ క్రాంతి) జుక్కల్ నియోజకవర్గం లో టిఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది  నియోజకవర్గంలోని పెద్ద కొడప్గల్ మండలం పోచారం తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ కోల సీతా బాయి , వార్డ్ మెంబర్స్ పలువురు గ్రామస్థులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతా రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మ్మె ల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. పోచారం తండా అభివృద్ధి కోసం రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థలు వంటి మౌలిక వసతులను మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తా మని పేర్కొన్నారు.

గ్రామ ప్రజల సహకారంతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి, తండాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే తెలిపారు.  స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.