calender_icon.png 5 February, 2026 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందస్తు గుర్తింపుతోనే క్యాన్సర్ నివారణ

05-02-2026 12:53:22 AM

  1. రూ.2 కోట్లతో అత్యాధునిక స్క్రీనింగ్ బస్సు

నందమూరి బాలకృష్ణ

బంజారాహిల్స్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఆధ్వర్యంలో నూతన సేవలు అందుబాటులోకి తెచ్చారు. సంస్థ చైర్మన్ నందమూరి బాలకృష్ణ క్యాన్సర్ బాధితుల కోసం పలు విప్లవాత్మకమైన సేవలను బుధవారం ప్రారంభించారు. ఉదయం హాస్పిట ల్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయం తో రూపొందించిన రెండో అత్యాధునిక ’క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు’ను ఆయన శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బసవతారకం ట్రస్టు బోర్డు సభ్యుడు జెఎస్ ఆర్ ప్రసాద్, సీఈఓ డాక్టర్ కె కృష్ణయ్య, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రావు, మెడికల్ సూపరింటిండెంట్ డాక్టర్ ఫణి కోటేశ్వర రావు, అకాడమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కల్పనా రఘునాథ్, పలు వైద్య విభాగాల అధిపతులు, వైద్యులు, సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.