4 April, 2026 | 3:47 PM

Breaking News

సకాలంలో రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయాలి   •   మేడ్చల్ పెద్ద చెరువు కట్ట పైనుంచి కిందకు రోడ్డు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి   •   రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి — మాస్టర్‌ ప్లాన్​పై సీఎం రేవంత్ సమీక్ష   •   ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •  

మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలు

13-02-2026 12:46 AM
  1. జీహెచ్‌ఎంసీలో ఏర్పాటుకు ప్రజా ప్రభుత్వం కసరత్తు  

టేక్ హోం రేషన్ విధానంలో సరుకులు అందజేసేలా ప్రతిపాదనలు

ఏడాదికి సుమారు రూ.4 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా

అర్హులందరికీ పోషకాహారం అందేలా చర్యలు చేపట్టాలి:

మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క  

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) : హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో వలస కార్మికులు అధికంగా నివసించే ప్రాంతాలు, బస్తీ లు, స్లమ్ ప్రాంతాల్లో అంగన్‌వాడీ సేవలు అందని అర్హుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే క చర్యలు ప్రారంభించింది. భవనాల కొరత, సాంకేతిక సమస్యలు, అలాగే కొత్త అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు దిశగా తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ కసరత్తు ప్రారంభించింది.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-- మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 2,364 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అయితే శాఖ నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో హెచ్‌ఎండీఏ పరిధి లోని 274 కవర్ కాని బస్తీల్లో 25,310 మం ది అర్హులైన చిన్నారులు, గర్భిణులు, బాలింతలను గుర్తించారు. అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో వీరికి పోషకాహార సేవలు సక్రమంగా అందడం లేదని వెల్లడైంది.

ఈ నేపథ్యంలో ‘ఏ ఒక్క అర్హుడు కూడా నష్టపోకూడదు, పోషకాహారానికి ఆ టంకం కలగకూడదు’ అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్-- లక్ష్యాల లో భాగంగా పోషక లోప రహిత తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అర్హులందరికీ అంగన్‌వాడీ సేవలు అందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశించారు. టేక్ హోం రేషన్ విధానంలో అర్హుల నివాసాలకే సరుకులు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో బాలామృతం, పాలు, స్నాక్స్, కోడి గుడ్లు, బియ్యం తదితర పోషకాహార పదార్థాలను పంపిణీ చేయనున్నారు.

ఈ ప్రణాళికలో భాగంగా 274 స్లమ్ ప్రాంతాలను కవర్ చేస్తూ 37 వాహనాలను అద్దెకు తీసుకుని మోబైల్ అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.60,000 అద్దె చెల్లించనున్నారు. జిల్లా వారీగా హైదరాబాద్‌లో 7, మేడ్చల్ 15, సంగారెడ్డిలో 1, రంగారెడ్డిలో 14 వాహనాలను వినియోగించనున్నారు. ఈ మొబైల్ కేంద్రాలను సమీప అంగన్‌వాడీ కేంద్రాలకు అనుబంధంగా నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమం అమలుకు సంవత్సరానికి సుమారు రూ.4 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే మొబైల్ అంగన్‌వాడీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పోషకాహార సేవలు అర్హులందరికీ అందాలని, సాంకేతిక సమస్యలతో ఎవరూ నష్టపోకూడదన్న లక్ష్యానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు.