స్మార్ట్ గేమ్‌లో మనీ ఇష్యూ!
28-09-2026 | 06:25pm
బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లో మిథిలేష్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ(Wildcard entry) ఇచ్చి .. ఒక్క నిర్ణయంతో గేమ్ మొత్తాన్ని తిప్పేశాడు! రెండు రోజులకే రూ.15 లక్షల బ్రీఫ్‌కేస్ ఆఫర్ డీల్ ఓకే చేసి కంటెస్టెంట్ల, ప్రేక్షకులకూ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. అయితే రూ.50 లక్షల ప్రైజ్ మనీలో రూ.15 లక్షలు తగ్గనున్నాయనే చర్చ మొదలైంది. అంటే విజేత ప్రైజ్ మనీ రూ.35 లక్షలకే పరిమితమవుతుందా? అన్న ప్రశ్న ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. రెండు రోజుల్లో రూ.15 లక్షలు(Rs 15 lakh).. ఇదే మిథిలేష్ ‘బిగ్‌బాస్ స్మార్ట్ గేమ్’ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.