06-11-2025 01:27:34 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో ఇప్పటివరకు బీజేపీ విజయం సాధించలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy ) అన్నారు. కిషన్ రెడ్డి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్యే ప్రాధాన పోటీ ఉంటే అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్( (Jubilee Hills by-election)నియోజకవర్గ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉందని సూచించారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి ఓటు వేయాలనే దానిపై ఇంకా స్పష్టత లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
సర్వేలను తాము విశ్వసించడం లేదన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గ్రామస్థాయిలో ఉండే అభివృద్ధి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ నిధుల కొరత ఉందని చెప్పారు. మజ్లీస్ మెప్పు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని, రూ. 2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచి పింఛన్ ఇస్తామని ఇవ్వలేదు, కొత్త పింఛన్లు మంజూరు చేయలేదని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సకల సమస్యలకు పరిష్కారం ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం యూసుఫ్ గూడ, బోరబండ డివిజన్లలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రోడ్ షోలలో పాల్గొన్నారు.