27 July, 2026 | 7:51 PM

Breaking News

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •  

ఈదురు గాలులకు బీహార్ వాసి మృతి

09-06-2026 01:27 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా నర్సింగాపూర్‌లో ఘటన

బోయినపల్లి: జూన్ 8 (విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ ప్రధాన రహదారిలో ఆదివారం సాయంత్రం వచ్చిన ఈదురు గాలులతో బీహార్‌కు చెందిన ఎండీ శంషాద్ (28) అనే వ్యక్తి మృతి చెందాడు. బీహార్‌కు చెందిన శంషాద్ నర్సింగాపూర్ ప్రధా న రహదారిలో తాత్కాలికంగా పంచర్ షాపు నడుపుతున్నాడు.

ఆదివారం సాయంత్రం భారీ ఈదురు గాలులు వర్షం రావడంతో షాప్ కొట్టుకపోయింది. అందులో ఉన్న శంషాద్‌కు  తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందా డు. కుటుంబీకులకు సమాచారం అందించారు.