15 May, 2026 | 10:57 PM

Breaking News

నందివాడలో బైకు దగ్ధం

05-02-2025 12:24 AM

తాడ్వాయి, జనవరి 4 ( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియ వ్యక్తులు ఇంటిముందు నిలిపి ఉంచిన బైకును దగ్ధం చేశారు గ్రామానికి చెందిన మాడే సత్యం తన ఇంటిముందు రాత్రి ఫ్యాషన్ ప్రో బైక్ ను నిలిపి ఉంచారు ఆయన ఇంట్లో పడుకుని ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పక్కాగా వచ్చి కావాలనే బైకును దగ్ధం చేశారని బాధితుడు  మాడే సత్యం తెలిపారు.

తనకు గ్రామానికి చెందిన ఒకరితో గొడవలు ఉన్నాయని ఈ గొడవల కారణంగానే అతను కావాలనే తన బైక్ ను దగ్ధం చేసి తనకు నష్టపరిచారని వివ రించారు వెంటనే పోలీసులు స్పందించి సదరు బాధ్యున్ని పట్టుకొని తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు గతంలో సైతం నందివాడ గ్రామంలో బక్క గణేష్ కు చెం దిన బైకును గుర్తుతెలియని వ్యక్తులు కావా లనే దగ్ధం చేశారు గణేష్ తన ఇంటి ముందు నిలిపి ఉంచగా కొందరు వ్యక్తులు వచ్చి బైకును దగ్ధం చేసి నష్టపరచారని గ్రామ స్తులు తెలిపారు.ఈ విషయమై పోలీ సులు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.