శివాజీ విగ్రహ ఏర్పాటుకు మాజీ ఎంపీపీ విరాళం
05-02-2025 12:22 AM
పెద్ద కొడప్గల్, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): పెద్ద కొడప్గల్ మండలము లోని అంజని చౌరస్తాలో శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుకు మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి రూ.50 వేల విరాళం అందజేసారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఏర్పాటుతో స్థానికుల ఆత్మాభిమానం పెంపొందించడమే కాకుండా, ప్రాంత అభివృద్ధికి తోడ్పడతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్యామ్, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, కృష్ణ గౌడ్, సాయిబాబా గౌడ్, గంగా గౌడ్ పాల్గొన్నారు.






