ఎమ్మెల్యే కారును ఢీకొన్న బైక్
ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
కసిరెడ్డి నారాయణరెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం
రంగారెడ్డి, మే6 (విజయక్రాంతి): కల్వకుర్తి ఎమ్మెలే కసిరెడ్డి నారాయణరెడ్డి కారును రాంగ్‌రూట్‌లో వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్, గట్టిప్పలపల్లి, వెల్‌జాల్ గ్రామంలో సోమవారం ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం చారకొండకు కారులో వెళ్తున్నారు. ఇదే సమయంలో వెంకటాపూర్ గ్రామానికి చెందిన పబ్బతి నరేశ్(25), పరుశరాం ఇద్దరూ కలిసి మిడ్జిల్ నుంచి బైక్‌పై వస్తున్నారు. వెల్‌జాల్ గ్రామ శివారు రామాసిపల్లి మైసమ్మ దేవాలయం సమీపంలోకి రాగానే కారును డీకొట్టారు. ప్రమాదంలో నరేశ్ అక్కడికక్కడే మృతిచెందగా పరశురామ్‌కు తీవ్ర గాయలయ్యాయి. ప్రమాదంలో కారు అదుపుతప్పి చెట్టుకు డీకొట్టింది. నారాయణరెడ్డికి స్వల్పగాయాలు అయ్యాయి. ప్రమాదనంతరం ఎమ్మెల్యే వేరే కారులో అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. తలకొండపల్లి ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తలకొండపల్లి మండలంలో ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా సాయంత్రం మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల ప్రచారానికి రావాల్సి ఉండగా ఈ ప్రమాదం కారణంగా వాయిదా పడింది.




