సిరిసిల్ల ప్రజలను కేటీఆర్ పట్టించుకోలేదు
07-05-2024 01:43 AM
కేకే మహేందర్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల, మే 6 (విజయక్రాంతి): సిరిసిల్ల ప్రజలను కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు పట్టించుకోలేదని, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయని వంగి వంగి దండాలు పెడుతున్నారని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కేకే మహేందర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిరిసిల్లలో ల్యాండ్, ఇసుక మాఫియాలకు కేటీఆర్ అండగా ఉన్నారని ఆరోపించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 9వ ప్యాకేజీ పనులను పట్టించుకోలేదని, ఇక్కడి నీళ్లను ఫామ్ హౌజ్‌కు మళ్లించుకున్నారని ఆరోపించారు. బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా తీరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజు, నర్సయ్య, రామానుజం తదితరులు పాల్గొన్నారు.




