అబద్ధాలు ప్రచారం చేస్తున్న రాహుల్
ఫేక్ వీడియోలతో బీజేపీ గోబెల్స్ ప్రచారం
రేపు పటాన్‌చెరు, నర్సాపూర్‌లో కేసీఆర్ రోడ్ షో
విజయవంతం చేయండి: మాజీ మంత్రి హరీశ్‌రావు
పటాన్‌చెరు/నర్సాపూర్, మే 6: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పట్టాన్‌చెరు, మెదక్ జిల్లా నర్సాపూర్‌లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే దురుద్దేశంతో మతం పేరుతో ఒకరు, రిజర్వేషన్ల పేరుతో మరొకరు ప్రజలను రెచ్చగొడుతున్నారని, వాటిని నమ్మవద్దని సూచించారు. పదేండ్లలో బీజేపీ దేశంలో అదానీ, అంబానీలను ప్రపంచ కుబేరులను చేసిందని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లా ముద్దుబిడ్డ కేసీఆర్‌ను తిడుతూ అవమానపరిచిన రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నిక ల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. ఫేక్ వీడియోలు సృష్టించి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ మెదక్ లోక్‌సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా బుధవారం సాయంత్రం పటాన్‌చెరు, నర్సాపూర్ పట్టణాల్లో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించే రోడ్‌షోను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరా రు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని చెప్పారు.
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం గడపగడపకూ వెళ్లి పార్టీ ప్రచారాన్ని విస్తృతం చేయాలని తెలిపారు. ఆయా సమావేశాల్లో మెదక్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మె ల్యేలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, నాయకులు సత్యంగౌడ్, సంతోష్‌రెడ్డి, మెట్టు కుమార్‌యాదవ్, ప్రభాకర్, దేవానంద్, కొలను బాల్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, ఆదర్శ్‌రెడ్డి, నగేశ్‌యాదవ్ పాల్గొన్నారు.




