జగిత్యాల నుంచే.. బీఆర్‌ఎస్ జైత్రయాత్ర
- రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోంది
- జగిత్యాలలో కేసీఆర్ సభ ఉంటే, మేడిగడ్డలో సభ పెట్టుకున్న సీఎం
- రేవంత్ హైట్‌లో చిన్న అనుకున్న.. కానీ ఆయన మెదడూ చిన్నదే
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- మహిళా బిల్లుపై కాంగ్రెస్, బీజేపీల ద్రోహం: హరీశ్‌రావు
జగిత్యాల, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): రాష్ట్రం లో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని, జగిత్యాల నుంచి బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. జగిత్యాల నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశా రు. మాజీ సీఎం కేసీఆర్ బయటకు వస్తుంటే గుం ట నక్కలు భయపడుతున్నాయన్నారు. జగిత్యాలలో కేసీఆర్ సభ ఉంటే, మేడిగడ్డలో సీఎం రేవం త్‌రెడ్డి సభ ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు.
రేవంత్ హైట్‌లో చిన్న అనుకున్న కానీ ఆయనది చిన్న మెదడని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే హైబ్రిడ్, క్రాస్‌బ్రీడ్ ఎమ్మెల్యేనా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ సభ విజయవంతమవుతుందని, మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమని అన్నారు. కేసీఆర్ కోరు ట్ల నుంచి జగిత్యాలకు రాకుండా ఇప్పడు రోడ్డు తవ్వుతున్నారని, ఇన్ని రోజులు ఆ రోడ్డు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు.
గతంలో ఎన్నో బహిరంగ సభలు ఇక్కడ విజయవంతమయ్యాయని, ఇప్పు డు ఈ సభ కూడా విజయవంతం అవుతుందని కేటీఆర్ చెప్పారు. శనివారం జీవన్‌రెడ్డిని కలిసిన అనంతరం ఈనెల 20న జగిత్యాలలోని వివేకానంద మినీ స్టేడియంలో జరగనున్న కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ ఏర్పాట్లను మాజీ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 20న సాయంత్రం 5.30 గంటలకు కేసీఆర్ జగిత్యాలకు చేరుకుంటారని వివరించారు.
సుమారు గంట సేపు కేసీఆర్ సభ ఉంటుందని ఆయన వెల్లడించారు. సభ సాయంత్రం జరుగుతు న్నా, ఎలాంటి ఇబ్బందిలేకుండా అందరికి మంచినీళ్లు, చల్ల పాకెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత టీ జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరబోతున్న సందర్భంగా జగిత్యాల జిల్లాలో పండుగ వాతావరణం కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు.
తేజస్వికి కిషన్‌రెడ్డి సపోర్టు..
ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ, బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగా ణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు తెలంగా ణ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సపోర్టుగా నిలిచారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే తెలంగాణ లో 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీ లు ఉన్నా ఏం లాభమని అన్నారు. బీజేపీ ఎంపీ బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఆత్మగౌరాన్ని దెబ్బ తీసిన ఎంపీ విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హరీశ్‌రా వు వెల్లడించారు. బడేబాయి, చోటేబాయి బం ధం మరోసారి బయటపడిందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో లేని లోటు నిన్న స్పష్టంగా కన్పించిందని అన్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రజల మీద విషం చిమ్మే ప్ర యత్నం చేస్తున్నారని ఆరోపించారు. మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నాటకమాడుతున్నాయని విమర్శించారు.
ఆ రెండు పార్టీలు కలిసి మహిళలకు అన్యాయం చేశాయని విమర్శించారు. ఎంపీ తేజస్వి వ్యా ఖ్యలను సీఎం రేవంత్ ఇప్పటివరకు ఖండించలేదని, రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ ప్రభు త్వం రాబోతుందని, దానికి నిదర్శనం బీఆర్‌ఎస్‌లో జీవన్‌రెడ్డి చేరిక అని స్పష్టంచేశారు. రాజకీయల్లో విలువలతో కూడిన రాజకీయం చేసిన వ్యక్తి జీవన్‌రెడ్డి అని కొనియాడారు.






