అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
నిర్మల్ జూన్ 3 (విజయ క్రాంతి)ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం నిర్మల్ జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్మల్ డి ఎఫ్ ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఐఎఫ్‌ఎస్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.ఈ బైక్ ర్యాలీ జిల్లా అటవీ కార్యాలయం నుండి ప్రారంభమై మంచిర్యాల్ చౌరస్తా, శాంతినగర్ చౌరస్తా, బస్టాండ్ మీదుగా చించోలి అర్బన్ పార్క్ వరకు కొనసాగింది. ర్యాలీలో జిల్లా అటవీ శాఖ సిబ్బంది, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి శ్రీ సుశాంత్ సుఖదేవ్ బోబడే గారు మాట్లాడుతూ, మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో అటవీ మండలాధికారులు శ్రీమతి ఆదం నాగిని భాను, శ్రీ శివకుమార్ (నిర్మల్, ఖానాపూర్), రామకృష్ణారావు ఎఫ్‌ఆర్‌ఓ నిర్మల్, జిల్లా అటవీ క్షేత్ర అధికారులు, జిల్లా అటవీ సిబ్బంది మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు....






