నేరేడుచర్లలో అంగన్వాడీ పిల్లలకు యూనీఫామ్స్ పంపిణీ
04-06-2026 02:32 AM
నేరేడుచర్ల, జూన్ 3: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు, చింతబండలో ఉన్న నేరేడుచర్ల-4 అంగన్వాడీ కేంద్రంలో ప్రీ-స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం తరఫున అందిన యూనిఫారాలను 14వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి సరికొప్పుల (అర్రురి) విజయ లక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలందరూ ఒకే విధమైన యూనిఫారం ధరించ డం వల్ల ఎలాంటి భేదభావాలు లేకుండా, ఒత్తిడి లేకుండా విద్యను అభ్యసించేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. చిన్నారుల ప్రాథమిక విద్యాభివృద్ధిలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ గుడిపాటి జయమ్మ, అల్మస్సీ కమిటీ సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.






